ముండ్లమూరు : రెడ్డి నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

మండలంలోని బసవాపురం గ్రామ సమీపంలోని రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు దర్శి నుండి ముండ్లమూరుకు వెళుతున్న కారు బసవపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న దాబా కోటేశ్వరరావు(46) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ముండ్లమూరు : రెడ్డి నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం