ముండ్లమూరులో 102 మద్యం సీసాలు స్వాధీనం
మండలంలోని పూరి మెట్ల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సంపత్ కుమార్ తెలిపారు. అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా శేషారావు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై 102 మధ్య సీసాలను తీసుకెళ్తున్న క్రమంలో దాడులు నిర్వహించామని ఎస్సై తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
