ముండ్లమూరు :అకాల వర్షాలకి విద్యుత్ పరికరాలు ధ్వంసం
అకాల వర్షాలకు ముండ్లమూరు విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు విద్యుత్ తీగలు తెగిపోయి, ఇన్సూలేటర్లు కాలిపోవడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తక్షణమే స్పందించిన విద్యుత్ ఏఈజే భూరాజు విద్యుత్ సిబ్బంది సమన్వ యంతో పనిచేసి యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పరికరాలు పునరుద్దరించి గ్రామాలకు విద్యుత్ సరఫరా అందించారు.ఏఈజే భూరాజు, విద్యుత్ సిబ్బందిని పలు గ్రామాల ప్రజలు అభినందించారు.
