కెల్లంపల్లిలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లి రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ అధికారి మేరమ్మ శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫీడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో రైతులకు కనీసం మద్దత్తు ధర కల్పించాలని లక్ష్యంతో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.కావున రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
