ఉపాధి పనులు పరిశీలించిన ఏపీఓ
ముండ్లమూరు మండలం కొమ్మవరంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీఓ కొండయ్య శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి తప్పనిసరిగా 100 రోజుల పనులు కనిపించాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. కూలీల సంఖ్య పెంచేలా చర్యలు చేపట్టాలని ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు సూచించారు. పేద ప్రజల కోసమే ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేసిందన్నారు.
