ముండ్లమూరు: రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరపాలని వినతి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్,ఏరియా కో-ఆర్డినేటర్లు దార్ల కోటేశ్వరరావు, జి వెంకటరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ముండ్లమూరు తహసీల్దార్ షేక్ నయీమ్ మహమ్మద్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈనెల 26న జరిగే రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
