ముండ్లమూరు: విష ప్రయోగం జరిగిందని పిఎస్ లో ఫిర్యాదు
మండలంలోని పసుపుగల్లు లో మూడు గేదెలు మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన శివయ్య కుటుంబ సభ్యులు గేదెలకు సాయంత్రం కుడితి తాపారు. అది తాగిన వెంటనే గేదెలు అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాయి చనిపోయిన మూడు గేదెల విలువ రెండు లక్షలు ఉంటుందని బాధితుడు అన్నాడు. తమ గేదెలకు విష ప్రయోగం చేసి చంపారని బాధితులు ముండ్లమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
