ముండ్లమూరు ఆటోలకు పోలీస్ నంబరింగ్ -ముండ్లమూరు ఎస్సై

ముండ్లమూరు ఆటోలకు పోలీస్ నంబరింగ్ -ముండ్లమూరు ఎస్సై
ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్

ప్రయాణీకుల సురక్షిత గమ్యమే లక్ష్యం- ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్

ప్రకాశం జిల్లా SP శ్రీమతి మలిక గర్గ్, IPS., గారి ఆదేశాలమేరకు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాణిస్తున్న ఆటోలకు స్థానిక ఎస్ఐ గారు పోలీస్ నెంబర్లను కేటాయించి పంపిణి చేశారు.

ఆ సందర్భంగా ముండ్లమూరు పోలీసుస్టేషన్ లో ఏర్పాటుచేసిన ఆటోవాలల సమావేశంలో ఎస్ఐ  మాట్లాడతూ ,నిబంధనలు పాటిస్తూ ,ఆటోలను నడపాలి పరిమితి వేగంతో నడుపుతూ ,ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చాలని అయన కోరారు. మద్యం సేవించి ఆటోలను నడపరాదని , ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి,ఆటోలకు సంబంధించి తగిన ధ్రువపత్రాలను ,డ్రైవింగ్ లైసెన్స్ లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ,100,112,181,1090 తదితర టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని అయన కోరారు . పోలీస్ నెంబర్లను ఆటోలకు అతికించాలని అయన కోరారు .

#Autodrivers #Counselling #Assigned #PoliceNumbers #QRCodes #ModernPolicing #Leadership #Malikagarg #IPS #PrakasamPolice #AndhraPradeshPolice.