ఉల్లగల్లు ఉపాధి హామీ కూలీలతో BSR న్యూస్

ఉల్లగల్లు ఉపాధి హామీ కూలీలతో BSR న్యూస్

గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని కుటుంబాల జీవనోపాధిని పెంపొందించడానికి దీనిని రూపొందించారు. దీని ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి కనీసం 100 రోజుల వేతనంతో కూడిన ఉపాధిని ప్రభుత్వం అందిస్తుంది. 

వేతనాల మార్పుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చి 24న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA), 2005 సెక్షన్ 6 (1) ప్రకారం దీనిని జారీ చేసింది. ఆయా రాష్ట్రాలను బట్టి రూ.7 నుంచి రూ.26 వరకు పెంపు వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి  వచ్చాయి. 

అయితే ఉల్లగల్లు లో ఉపాధి కూలీలను BSR న్యూస్ పలకరించగా చాలా ఆసక్తికరంగా వారి మాటలు ఉన్నాయి. అన్ని గ్రూపుల వారు చాలా చక్కగా ఉపాధి పనులు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఉదయాన్నే రావడం, దాహార్తి తీర్చడం కోసం నీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎండ నుంచి తట్టుకోవడం కోసం టార్పాలిన్ పట్టలను కూడా ఏర్పాటు చేయబోతున్నారని,  తెలిపారు.