ముండ్లమూరు: ‘కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే సమాచారం ఇవ్వాలి’
ముండ్లమూరు మండలంలో కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్ఐ మాట్లాడుతూ... వేసవి కాలం కావడంతో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారన్నారు. గ్రామాలలో వీధి వ్యాపారాలు చేసుకునే వారిని గమనిస్తూ ఉండాలని ప్రజలకు సూచించారు. రాత్రి సమయాలలో ఆరు బయట పడుకోవద్దని తెలిపారు.
