ప్రకాశం లో స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... 20 మందికి గాయాలు

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు వద్ద శనివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు అదుపుతప్పి విద్యుత్ సంబంధ ఢీ కొట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి ఆరా తీస్తున్నారు.

ప్రకాశం లో స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు... 20 మందికి గాయాలు