పల్నాడు జిల్లాలో ఉరివేసుకొని ముండ్లమూరు వాసి మృతి
నూజెండ్ల మండలం ముప్పరాజు వారి పాలెం పొలాల వద్ద ప్రకాశం జిల్లా ముండ్లమూరు గ్రామానికి చెందిన రామారావు (55) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న అయినవోలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించారు.దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అయినవోలు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.
