పోలవరం పాదయాత్రకు ముండ్లమూరు సీపీఎం నేతల సంఘీభావం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని సిపిఎం ఆధ్వర్యంలో నెల్లిపాక నుంచి విజయవాడ వరకు తలపెట్టిన పాదయాత్రకు ముండ్లమూరు మండల నేతలు సంఘీభావం తెలిపారు. ఆదివారం మండల కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు, హనుమంతరావు, రామాంజనేయులు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.శ్రీనివాసరావుతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం స్థలాలు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పోలవరం పాదయాత్రకు ముండ్లమూరు సీపీఎం నేతల సంఘీభావం