ముండ్లమూరు: 32 మద్యం సీసాలు పట్టివేత
ముండ్లమూరు మండలం వేంపాడు ఎడ్లపల్లి వేణుగోపాలరావు నుంచి 32 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. వేణుగోపాల్ రావు ఇంట్లో అక్రమంగా మద్యం ఉన్నట్లు సమాచారంతో దాడి చేసి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచునున్నట్లు తెలిపారు.
