ముండ్లమూరు ఎంఆర్పి ధరలకే ఎరువుల విక్రయం
వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ఎరువుల తనిఖీ ప్రత్యేక టీం పెద్ద ఉల్లగల్లు గ్రామ రైతు భరోసా కేంద్రను తనిఖీ చేశారు. హబ్ మేనేజర్ మధుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ ఎరువుల వివరాలు గోడౌన్ లోని ఎరువుల వివరాలను తనిఖీ చేశారని తెలిపారు. ఎమ్మార్పీ ధరలకే ఎరువుల విక్రయాలు జరగాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సాదిక్ కోటేశ్వరావు వెంకట్రావు పాల్గొన్నారు.
