ముండ్లమూరు: సబ్సిడీపై రైతులకు విత్తనాలు మంజూరు
ముండ్లమూరు మండలానికి ఎల్ఆర్జి కందులు 58 క్వింటాలు, 44 కేజీల కొర్రలు మంజూరైనట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి షారుక్ తెలిపారు. ముండ్లమూరులోని ఏవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... రైతులకు రాయితీపై ఈ విత్తనాలను అందజేయడం జరుగుతుందన్నారు. విత్తనాలు కావలసిన రైతులు తమకు అందుబాటులోని రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని కోరారు.
