ముండ్లమూరు: చికిత్స పొందుతూ బాలింత మృతి
బసవాపురం గ్రామానికి చెందిన గర్నెపూడి యశోద (35) అనే బాలింత గుంటూరులో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందగా భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ఈనెల 1న ఐదుగురు యశోద పై దాడి చేయడంతో ఆమె గాయపడింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం యశోద మృతి చెందగా. ఆమె భర్త పెద్ద అక్క రాజు స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
