ముండ్లమూరు :ఐక్యతా విజయపధం పాదయాత్ర
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం ముండ్లమూరు పట్టణంలో మాజీ ఐఏఎస్ అధికారి కెఎస్ఆర్కె విజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఐక్యతా విజయపథం పాదయాత్ర జయప్రదం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య తెలిపారు. స్థానిక ఎస్సీ కాలనీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పాదయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నెల 17న ముండ్లమూరు మండలంలో విజయ్ కుమార్ పాదయాత్ర ఉంటుందన్నారు.
