దర్శి లో వాతావరణ స్థితి - BSR TELUGU NEWS

దర్శి లో వాతావరణ స్థితి - BSR TELUGU NEWS

దర్శి నియోజకవర్గం లో

వాతావరణ సూచనలు - సలహాలు

జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు మరియు ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు (30-40 కి.మీ.) మరియు వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలకు జిల్లాలోని కొన్ని ప్రధాన పంటలు దెబ్బతినే అవకాశం ఉన్నది. వివిధ పంటలలో తీసుకొన వలసిన జాగ్రతలు : 

వరి : జిల్లాలోని పలు ప్రాంతాలలో వరి పంట కోత దశలో ఉన్నది. ఈ సమయంలో 30-40 కిలోమీటర్ల వేగంతో గాలి విస్తే పంట చేను పడిపోయే అవకాశం ఉన్నది. పొలంలో అధిక వర్షానికి నీరు నిలిస్తే గింజలు తడిచి రంగును కోల్పోవడమేగాక మార్కెట్ లో తగిన గిట్టుబాటు దర పలకదు. 

సలహా : పంట పొలం నుండి అదనపు నీటిని బయటకు పోయేలా డ్రైనేజీ మార్గాలను ఏర్పాటు చేయండి. వర్షం ఆగిన తరువాత చేనుపై పడిపోయిన పంటను పైకి లేపు 5% ఉప్పు ద్రవనాన్ని పిచ్చికరి చేయడం ద్వారా కొంతవరకు విత్తనం మొలకెత్తకుండా కాపుడుకోవచ్చు. 

మొక్కజొన్న : పంట ప్రస్తుతం పూత దశలో ఉన్నది. ఈ అధిక వర్షానికి పూత రాలిపోవడం లేదా ఈదురు గాలులకు పంట పడిపోవును. 

సలహా : నీటిపారుదలని వాయిదా వేయండి. మరియు రసాయనిక పిచికారీ మరియు ఎరువులు వేయకుండా నివారించండి. గాలి కి విరిగిపోయే అవకాశం ఉన్న ప్రాంతాలలో పొడవాటి దట్టమైన పందిరి చెట్లతో పెల్టర్బెల్ట్ ఏర్పటుచేయాలి.  పంట పొలం నుండి అదనపు నీటిని బయటకు పోయేలా డ్రైనేజీ మార్గాలను ఏర్పాటు చేయండి.

ప్రత్తి : జిల్లాలో పలు ప్రాంతాలలో రైతులు వేసవి ప్రత్తిని సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్తి పంట పెరుగుదల దశలో ఉన్నది. ఈ దశలో అధిక వర్షాల కరణంగా పంట పొలాలలో నీరు నిలబడి పంట పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. అలాగే పంటలో సూక్ష్మ పోషకలోపాలు కూడా కనిపిస్తాయి. 

సలహా : నీటి ముంపుకు గురైనపుడు, మురుగు నీటిని తీసివేయడంతో పాటుగా, ఎండ ఉన్న సమయంలో 20 గ్రా. పొటాషియం నైట్రేటు మరియు 20 గ్రా. యూరియాను లీటరు నీటికి చొప్పున మార్చి మార్చి పిచికారి చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది.

మిరప : మిరప పంట కోత దశలో ఉన్నది. అధిక వర్షాలకు మరియు మబ్బులతో కూడిన వాతావరణం కరనంగా కాయ కుల్లు వచ్చే అవకాశం ఉన్నది. ఈ తెగులు ఆశింస్తే కాయకు మార్కెట్ లో తగిన గిట్టుబాటు దర లబించదు. అధిక నీరు పొలంలో ఉన్నట్లైతే పంట పడిపోవడం మరియు మొక్కలు చనిపోవడం వంటి లక్షణాలు కనపడును. 

సలహా : కాయ కుల్లు తెగులు నివారణకు వర్షం తగిన తరువాత ప్రాపికొనజోల్ 1.0 మి.లీ. లేదా అజాక్షిస్త్రోబిన్ 2.5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. కోసిన కాయలు కల్లాలపై ఉన్నట్లైతే వర్షానికి తడవకుండా వాటిని టార్పాలిన్ పట్టాలతో కప్పి సంరక్షించుకోవాలి. 

పశువులు : ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలుల దృష్ట్యా పశువులను బహిరంగ నీటికి, చెరువులకి మరియు నదులకి దూరంగా ఉండాలి. పశువులను ట్రాక్టరుకి లేదా ఇతర లోహ సంబంధిత పనిముట్లకి దూరంగా ఉండాలి. పశువులను కరెంటు స్థంబానికి, చెట్లకి మరియు వాటిని సురక్షితమైన పాకలలో ఉండేటట్టు జాగ్రత్త వహించాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు నిమోనియా మరియు గొంతు వాపు మరియు గాలి కుంటు వంటి వ్యాదులు సోకే అవకాశం ఉన్నది. ముందస్తు నివారణకు పశువులకు టీకాలను వెపించుకోవాలి.

ఆర్. కాశీ విశ్వనాథ్, శాస్త్రవేత్త

(వ్యవసాయ వాతావరణ విభాగం)

కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి

ఇతర సలహాలకు సంప్రదించండి

ఆర్. కాశీ విశ్వనాథ్,

ఫోన్ : 8870888853