స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర

" జాబ్ అనే పేరు తనలో నింపుకోవడమే కాదు, వేలాదిమందికి జాబ్స్ ఇచ్చిన ఒక మార్గదర్శకుని కథ. "1955 శాన్ ఫ్రాన్సిస్కో..జోయిల్ కరోల్ షీబెల్ అనే యువతి తను ప్రేమించిన సిరియావాసి అబ్థుల్ పత్తా జండాలి అనే యువకుడిని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్ళి మేము ప్రేమించుకుంటున్నామని,పెళ్ళి చేసుకుంటామని చెప్పింది. అందుకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు..కానీ అప్పటికే ఆమె గర్భంతోవుంది.పైగా వాళ్ళిద్దరూ యూనివర్సిటీ విద్యార్థులే అప్పటికి. అబార్షన్ చేయించుకోవడానికి వీలులేదు.. అలాంటి పరిస్థితుల నడుమ ఫిబ్రవరి 24 1955 వ తేదిన షీబెల్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. తప్పనిపరిస్థతులలో అప్పుడే పౌల్ జాబ్స్ ,క్లారా జాబ్స్ అనే దంపతులకు ఆ బిడ్డను దత్తతుకు ఇవ్వడం జరిగిపోయింది. ఫౌల్ జాబ్ ఒక లేజర్ల తయారీకంపెనీలో మెకానిక్ కాగా ,క్లారా అకౌంటెంట్ గా పనిచేసేవారు. వారు దత్తతకు తీసుకున్న బాబుకు "స్టీవ్ "అని పేరు పెట్టారు. ఫౌల్ చిన్నారి స్టీవ్ కు మిషనరీలిప్పడం, అసంబుల్డ్ చేయడం చిన్నప్పడే చూపించేవాడు.వాటిని శ్రద్ధగా గమనించే స్టీవ్ క్రమంగా ఎలక్ట్రానిక్స్ మీద ఇష్టం పెంచుకున్నాడు. తల్లి పాఠశాలలో చేరకముందే చదవను,రాయను నేర్పించింది. 1960 లో ఫౌల్ జాబ్స్ తన నివాసాన్ని కాలిపోర్నియాకు మార్చాడు. లామా ఎలిమెంటరీ స్కూల్ లో స్టీవ్ ను చేర్పించాడు. ప్రాథమిక తరగతులలోనే మంచి ప్రతిభ కనబరిచాడు స్టీవ్ .టీచర్స్ నుండి అభినందనలు పొందాడు. ఎలిమెంటరీ విద్య అయిపోగానే క్యూపర్టీలోని హోమ్ స్టెడ్ హైస్కూల్ లో చేరాడు. అక్కడ బిల్ పెర్నాండజ్ ,స్టీవ్ వోజ్ఞియాక్ ల పరిచయం అయింది. 1972 లో ఓరేగాన్ రాష్ట్రంలోని ఫోర్ట్ ల్యాండ్ దగ్గర వున్న రీడ్ కాలేజ్ లో చేరిన స్టీవ్ అదే సంవత్సరమే కాలేజ్ మానేయాల్సి వచ్చింది.కారణం అది చాలా ఖరీదైన కళాశాల. అప్పటికే ఫౌల్ జాబ్స్ ఆర్థికంగా చితికిపోయాడు..పెద్ద మొత్తంలో ఆ కళాశాలకు డబ్బులు కట్టేసాడు. కాలేజ్ మానేసినా అడిటింగ్ క్లాసులకు హాజరయ్యేవాడు. పేదరికం వలన స్టీవ్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది.రోజు వారీ ఖర్చులకు కూడా కష్టమైపోయింది. తిండికి,డబ్బులకోసం వీధులలో త్రాగిపారేసిన ఖాళీ కోక్ క్యాన్స్ ను కలెక్ట్ చేసి అమ్మేవాడు. "హరే క్రిష్ణ టెంపుల్లో పెట్టే ఉచిత భోజనం చేసేవాడు". నిరాశా నిసృహలతో కృంగిపోయిన స్టీవ్ క్రమంగా డ్రగ్స్ కు అలవాటు పడిపోయాడు. మారిజునా..కొకైన్ కు బానిసైపోయాడు...అదే కొన్నాళ్ళు జరిగివుంటే "బాబ్ స్టీవ్ "ఎవరో ప్రపంచానికి తెలియక పోయివుండవచ్చు..... ఒక రోజు ఉచితభోజనానికి "హరేక్రిష్ణ"టెంపుల్ కు వెళ్ళిన స్టీవ్ అక్కడ పూజారి మాటలు విని 1974 లో భారత్ కు వచ్చి సంవత్సరం పాటు జైన, బౌద్ధమతాలను అధ్యయనం చేసాడు...క్రమక్రమంగా మత్తు బానిసత్వం నుండి బయటబడ్డాడు...అతని నిరాశ,నిసృహల స్థానంలో ఏదోసాధించాలన్న ఆశాకిరణం మొదలైంది...1975 లో భారత్ నుండి అమెరికాకు వెళ్ళిపోయాడు. ఇంతలో తన హైస్కూల్ మిత్రులైన వోజ్ఞియాక్ ,రోనాల్డ్ వేక్ లు కంప్యూటర్ రంగంలోనికి అడుగుబెడుతూ స్టీవ్ నుా ఆహ్వానించారు.స్టీవ్ డిజైనర్ గా 1976లో "ఆపిల్ కంప్యూటర్స్ -ప్రారంభమైంది స్నేహితుని ఇంట్లోనే ఆఫీసుగా!! దీనికి ఇంటెల్ ఉద్యోగి మైక్ మర్కుల అనే అతను ఆర్థిక సహాయం చేశారు. ఆపిల్ సంస్థ అనతి కాలంలో మంచిపేరుప్రఖ్యాతలు సంపాదించింది.1979 లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫెస్ కలిగిన మౌస్ ద్వారా నడిచే జిరాక్స్ ఆల్టో వాణిజ్య అవసరాలకు కంఫ్యూటర్ తయారు చేశారు. 1985లో డిస్కటాప్ పబ్లిషింగ్ (డి.టి.పి) కంప్యూటర్స్ తయారీతో ఆపిల్ సంస్థ ఆర్థికంగా టాప్ పొజిషన్ కు చేరింది. వీటన్నంటిలోనూ స్టీవ్ పాత్ర అమోఘమైనది. అయితే వ్యవస్థాపక సభ్యులలో అధికారపోరు మొదలై 1986లో స్టీవ్ ను ఆపిల్ నుండి బయటకు పంపారు. అయినా కుంగిపోకుండా "Next " సంస్థను ప్రారంభించారు. తర్వాత "ఫిక్సర్ యానిమేషన్ సంస్థను స్థాపించారు.2006లో వాల్ట్ డిస్నీ ఫిక్స్ ర్ ను కొన్నతరువాత అందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పనిచేశాడు. 1997 లో ఆపిల్ సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోగా..నెక్ట్స్ సంస్థ ను ఆపిల్ కొని మళ్ళీ జాబ్ స్టీవ్ కు ఆపిల్ కంపెనీకి సిఇఓ అప్పగించింది. ఐదు సంవత్సరములలోనే మళ్ళీ దానిని ఆర్థికపట్టాలెక్కించి పరిగెత్తించాడు... ఐమేర్ ,ఐ ట్యూన్స్ ,యాపిల్ స్టోర్ ,ఐపోడ్ ,ఐ ట్యూన్స్ స్టోర్స్ , ఐ ఫోన్ ,యాప్ స్టోర్స్ , ఐపాడ్ ఇవన్నీ బాబ్ స్టీవ్ ఆలోచనకు ప్రతిరూపాలే!! ఒక్కప్పుడు పేదరికంతో చదువు మానేసాడు. కడుపు నింపుకొనేందుకు చెత్తను కలెక్ట్ చేసాడు. జాబ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు..నిరాశతో డ్రగ్ కు ఎడిక్ట్ అయినాడు...కానీ వాటినన్నింటినీ జయించి తనే కొన్ని లక్షల మందికి జాబ్స్ సృష్టించాడు...ఇంటర్ కూడా పూర్తిగాని స్టీవ్ జాబ్స్ ప్రసిద్ది చెందిన విశ్వవిద్యాలయాలలో,ఐఐటిలలో చదినవారికి జాబ్స్ ఇచ్చాడు...మీ విజయానికి కారణం ఏమిటి అని అడిగితే " నా పని పట్ల ఇష్టమే"నా విజయం అని నవ్వుతూ సమాధానం ఇచ్చేవాడు స్టీవ్ " 2011 లో కాన్సర్ వ్యాధితో తన 56 వ యేట కనుమూసాడు జాబ్ స్టీవ్.

స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర
స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర
స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర