ముండ్లమూరు :క్యాంపస్ ఇంటర్వ్యూలలో 30 మంది ఎంపిక
పోలవరం క్రాస్ రోడ్డు వద్ద గల వేద ఫార్మసీ కాలేజీలో శనివారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పి. జి, డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన 200 మంది విద్యార్థులు ఇంటర్వ్యూకు హజరయ్యారు. మేడి అసిస్టెంట్ ఇండియా టి. పి. ఎ ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీ, కీవీస్ జనరిక్ ప్రై వెట్ లిమిటెడ్ హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించగా,30మందిని ఎంపిక చేసారు.
