ముండ్లమూరులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎస్సై
ముండ్లమూరు పరిధిలోని అనుమానిత ప్రదేశాలలో శుక్రవారం ఎస్సై సంపత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై సంపత్ కుమార్ దుకాణాలను సైతం తనిఖీ చేశారు. ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా గంజాయి,నిషేధిత,గుట్కా ప్యాకెట్లను విక్రాయించినా,నిల్వ చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే నాటు సారాను తయారు చేసిన చర్యలు తప్పవన్నారు
