ముండ్లమూరు : రెవిన్యూ గ్రామసభ నిర్వహణ
కెల్లంపల్లి పంచాయతీలోని భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే రెవెన్యూ గ్రామ సభ ద్వారా పరిష్కరించుకోవాలని శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ రవికాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెబ్ ల్యాండ్ లో పేరు తప్పులు,మరణించిన రైతుల పొలాలను వారసులకు ఆన్లైన్ చేయడం, తదితర సమస్యలను ఈ గ్రామ సభలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సచివాలయ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.
