ముండ్లమూరు మహిళా పోలీస్ సస్పెన్షన్
ముండ్లమూరు సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న తాతపూడి శాంతి ప్రియ ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ మల్లికా గర్గ్ నుంచి మంగళవారం ఆదేశాలు వచ్చాయని ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అలశత్వం వహించడంపై ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారని ఎస్ఐ తెలిపారు.
