ఆటో డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలు పాటించాలి.
ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులతో ఆటోలలో ప్రయాణించరాదని ముండ్లమూరు ఎస్సై సంపత్ కుమార్ అన్నారు.ముండ్లమూరులో బుధవారం ఆటో డ్రైవర్లతో ఎస్సై మాట్లాడుతూ..ప్రతి ఆటో డ్రైవర్ రహదారి భద్రతా నియమాలు పాటించాలన్నారు.అలాగే అన్ని ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలని,ఎవరైనా అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని తమకు తెలియజేయాలన్నారు.
