Wipro | విప్రోకు షాక్‌.. డిజిట‌ల్ ప్రెసిడెంట్ రాజ‌న్ కోహ్లీ రాజీనామా.. 30 ఏండ్ల బంధం తెగ‌దెంపులు!

Wipro | విప్రో డిజిటల్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న రాజన్ కోహ్లీ సంస్థకు రాజీనామా చేశారు. విప్రోతో తనకు ఉన్న 30 ఏండ్ల అనుబంధాన్ని వదులుకున్నారు.Wipro | ఐటీ దిగ్గ‌జం విప్రోకు మ‌రో షాక్ త‌గిలింది. సంస్థ‌ ప్రెసిడెంట్‌గా ప‌ని చేస్తున్న‌ రాజ‌న్ కోహ్లీ రాజీనామా చేశారు. నాయ‌క‌త్వ స్థాయిలో భారీగా సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌లు త‌ప్పుకుంటున్న నేప‌థ్యంలో రాజ‌న్ కోహ్లీ రాజీనామా ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది. దాదాపు మూడు ద‌శాబ్దాలుగా విప్రోతో త‌న‌కు గ‌ల అనుబంధాన్ని రాజ‌న్ కోహ్లీ తెగ‌దెంపులు చేసుకున్నార‌ని ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక ఓ వార్తా క‌థ‌నం ప్ర‌చురించింది. విప్రో ఇంటిగ్రేటెడ్ డిజిట‌ల్, ఇంజినీరింగ్ అండ్ అప్లికేష‌న్ స‌ర్వీసెస్ బిజినెస్ లైన్ (ఐడీయాస్‌)కు అధ్య‌క్షుడిగా ఉన్నారు. ల‌క్ష మందికిపైగా ఉద్యోగులు గ‌ల టీమ్‌కు సార‌ధ్యం వ‌హిస్తున్నారు.కంపెనీ డిజిట‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బిజినెస్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన విప్రో డిజిట‌ల్ ప్రెసిడెంట్‌గా రాజ‌న్ కోహ్లీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే సంస్థ సీఈవో థెర్రీ డెలాపోర్ట్ సంస్థలో స‌మూల మార్పులు చేశారు. విప్రో డిజిట‌ల్ ప్రెసిడెంట్‌గా రాజ‌న్ కోహ్లీ.. సంస్థ అత్యంత రిక‌గ్నైజ్డ్ బిజినెస్‌ల్లో డిజిట‌ల్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బిజినెస్ విభాగాన్ని తీర్చి దిద్దారు. రాజ‌న్ కోహ్లీకి ముందు ప‌లువురు సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌లు విప్రో నుంచి నిష్క్ర‌మించారు. అంగ‌న్ గుహా అనే సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా చేసిన త‌ర్వాత.. కీల‌క స్థాయిలో ప‌ని చేస్తున్న రాజ‌న్ కోహ్లీ వైదొలిగారు. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో అంగ‌న్ గుహా వైదొలిగారు. అంగ‌న్ గుహా మూడు ద‌శాబ్దాలుగా విప్రోలో వివిధ హోదాల్లో ప‌ని చేశారు. ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌, మాన్యుఫాక్చ‌రింగ్‌, ఎనర్జీ అండ్ యుటిలిటీస్‌, హైటెక్‌, కెన‌డా ఆప‌రేష‌న్స్‌లో కీల‌క పాత్ర పోషించారు. ఇటీవ‌ల సీనియ‌ర్లు రాజీనామా చేస్తుండ‌టంతో విప్రో యాజ‌మాన్యం గ‌త నెల‌లో 70 మంది సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌లకు వైస్‌ప్రెసిడెంట్‌, సీనియ‌ర్ వైస్‌ప్రెసిడెంట్లుగా ప్ర‌మోష‌న్లు క‌ల్పించింది.