ఆయుష్మాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి BSR NEWS

ఆయుష్మాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి తవణంపల్లి ఏప్రిల్ 17 తవణంపల్లి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తవణంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర లో పనిచేస్తున్న మాకు ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి నిరసన తెలిపామని ఆయుష్మాన్ భారత నిబంధనలు ప్రకారం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి కల్పించలేదు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో సమానంగా 23% ఉద్యోగ సవరణ జరగాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా ఆరు సంవత్సరాల తరువాత రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు 2019 నుంచి గ్రామానప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర కమ్యూనిటీ ఆఫీసర్ గా పని చేస్తున్న తాము గత రెండు సంవత్సరాలుగా జీతం విషయంలో తీవ్రగా నిరాశన ఎదుర్కొంటామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు