పూతలపట్టు మండలంలో పోషణ పక్వాడ కార్యక్రమం జరిగింది. BSR NEWS

పూతలపట్టు మండలంలో పోషణ పక్వాడ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భవతులకు పిల్లలకు అవగాహన ఇవ్వడం జరిగింది. గర్భధారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పోషకాహారం తినాలి. తగిన విశ్రాంతి తీసుకోవాలి .తల్లి మానసిక ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని 1000 రోజుల సంరక్షణలో భాగంగా తల్లులకు వివరించడం అయినది. పోషకాహార లోపం ఉన్న బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆహారం గురించి చెప్పడమైనది. బిడ్డ సాధారణ స్థాయికి వచ్చేవరకు పర్యవేక్షించాలి. అలాగే జంక్ ఫుడ్ గురించి పిల్లలకు పెట్టవలసిన ఫుడ్డు గురించి తల్లులకు వివరించబడినది .ఈ కార్యక్రమంలో గర్భవతులకు శ్రీమంతాలు 6 నెలలు పూర్తి అయినను పిల్లలకు అన్న ప్రసన్న చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఐరాల ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీమతి జి .నిర్మల గారు .M.E.O. మధుసూదన్ రెడ్డి గారు.A.P.O. సింగన్న గారు .సూపర్వైజర్ I. భారతి గారు.B.P.C. ఎస్. నర్సీన్ గారు.మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు