దర్శి నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించిన దర్శి టీడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి

మార్కాపురం పర్యటనకు శనివారం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలుసుకొని దర్శి నియోజకవర్గంలో సమస్యలపై వినతి పత్రాలను డా గొట్టిపాటి లక్ష్మీ సమర్పించారు. ముఖ్యంగా వెంకటాచలం పల్లి To దొనకొండ రహదారి చాలా అవసరమని ఈ రోడ్డును సింగల్ లైన్ To డబల్ లైన్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని ఆమె కోరారు. సుమారు 12 కిలోమీటర్లు పొడవున్న ఈ రోడ్డు అభివృద్ధికి 50 కోట్లు నిధులు అవసరం అవుతాయని ప్రాథమిక అంచనాలు అధికారులు వేశారని డాక్టర్ లక్ష్మీ సీఎం గారికి తెలిపారు. దొనకొండ to దర్శి మండలాల ను చేరుకునేందుకు ప్రజలకు ఈ రోడ్డు అభివృద్ధి ద్వారా సాధ్యమవుతుందని ఆమె వివరించారు. అంతేకాక విజయవాడ, పొదిలి, వినుకొండ వంటి ప్రధాన పట్టణాలకు చేరుకునేందుకు కూడా ఈ రహదారి అవసరమని ఆమె వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి త్వరలో రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారు అని డా లక్ష్మీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.