ముండ్లమూరు లో భారీ చోరీ జరిగింది..
ముండ్లమూరు లో భారీ చోరీ జరిగింది... రిటైర్డ్ విఆర్ఓ కాంతారావు (లేట్) కుమారుడు శ్రీనివాసరావు కూడా కొరిశపాడు లో వీఆర్వో గా విధులు నిర్వహిస్తున్నాడు... రెండు రోజుల క్రితం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు నెల్లూరులోని వారి బంధువులు ఇంటికి వెళ్లారని సమాచారం.. గత రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి వెనకాల తలుపు పగలగొట్టి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీఆర్వో ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న కొంతమేర నగదుతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. పోలీసులు వివరాలు సేకరించే పనులు నిమగ్నమయ్యారు.
