విద్యార్థులకు అవగాహన కల్పించిన దర్శి సీఐ, ఎస్ఐ

ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో గల వేద ఫార్మా కళాశాలలో శుక్రవారం సంకల్పం కార్యక్రమంలో భాగంగా పోలీసులు డ్రగ్స్ తో కలిగే అనర్ధాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దర్శి సీఐ రామ కోటయ్య, ఎస్సై సంపత్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ కు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులకు అవగాహన కల్పించిన దర్శి సీఐ, ఎస్ఐ