*101 టెంకాయలతో మొక్కు తీర్చుకున్న సర్పంచ్ అభ్యర్థి వరగాని ఇస్సాక్*

*101 టెంకాయలతో మొక్కు తీర్చుకున్న సర్పంచ్ అభ్యర్థి వరగాని ఇస్సాక్* టిడిపి అధినేత నారా చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావడంతో ముండ్లమూరు మండలంలో తెలుగు తమ్ముళ్లు మంచి జోష్లో ఉన్నారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో 2021 ఎన్నికలలో టిడిపి తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వరగాని ఇస్సాక్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద 101 టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకొని నిజం తెలిసింది న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వరగాని పౌలు, మాజీ సర్పంచ్ ఇందూరు పిచ్చిరెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కొర్రపాటి శ్రీనివాసరావులతో పాటు పలువురు టిడిపి అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

*101 టెంకాయలతో మొక్కు తీర్చుకున్న సర్పంచ్ అభ్యర్థి వరగాని ఇస్సాక్*