పల్నాడు జిల్లాలో ఉరివేసుకొని ముండ్లమూరు వాసి మృతి.

నూజెండ్ల మండలం రవ్వారం గ్రామంలోని కొండపై వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.ఉపాధి హామీ కూలీలు పనులకు వెళ్ళగా దుర్వాసన వస్తుండడంతో చుట్టుప్రక్కల పరిశీలించారు. సమీపంలో వేప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అతని వద్ద ఉన్న ఆధారాలు ఆధారంగా ముండ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన గోపిరెడ్డి వెంకటేశ్వర్లుగా గుర్తించారు.

పల్నాడు జిల్లాలో ఉరివేసుకొని ముండ్లమూరు వాసి మృతి.