అంకాలమ్మ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం
ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో అంకాలమ్మ దేవాలయ నిర్మాణానికి దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ విరాళం అందజేశారు. మంగళవారం ఎమ్మెల్యే ఆయన స్వగృహములో ఆలయ కమిటీ సభ్యులకు రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం చేయడం సంతోషకరంగా ఉందని చెప్పారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
