పులితండాలో కొండచిలువ కలకలం భయాందోళనలో గ్రామస్తులు
ముండ్లమూరు మండలం పులి తండా గ్రామంలో కొండచిలువ సోమవారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన హనుమాన్ నాయక్ వరి పొలంలో గత రెండు రోజులుగా కొండచిలువ సంచరిస్తుంది. ఈ వ్యవసాయ క్షేత్రం గ్రామానికి ఆనుకొని ఉండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
