ప్రారంభమైన కిషోరి వికాసం సమర్ క్యాంపెన్ BSR NEWS

ప్రారంభమైన కిషోరి వికాసం సమర్ క్యాంపెన్ BSR NEWS

ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ ఐరాల పరిధిలో పూతలపట్టు మండలం ఎం. బండపల్లి సచివాలయంలో మహిళా పోలీస్ ఆధ్వర్యంలో కిషోరి వికాసం సమర్ క్యాంపెన్. కౌమార బాలికల సాధికారిత లో భాగం గా కిషోరి బాలికలు ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, లక్ష్యాలు నిర్ధారించుకోవడం, ఈరోజు ప్రోగ్రామ్స్ సందర్భంగా నేమ్ డాన్స్ అనే ఆట ఆడించడం జరిగింది. అలాగే మే 2వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బుతుక్రమము, పరిశుభ్రత నిర్వహణ ,లైంగిక విద్య, కెరియర్, బాల్యవివాహాలు, బాలల హక్కులు మరియు సంరక్షణ ఫోక్సోయక్ట్ ,ఇనుము లోపం, లింగఅసమానత, విద్య, కెరియర్, మార్గదర్శకత్వం మరియు నైపుణ్యాలు ప్రాముఖ్యం. సైబర్ భద్రత, నాయకత్వం మరియు సాధికారత శారీరక వ్యాయామం, క్రీడలు ఆటలు మొదలైన వాటిపైన నిర్ధారించిన తేదీల్లో 12 రోజుల్లో 12 అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అందరూ ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం తప్పకుండా హాజరు కావాలని మీ ఆరోగ్యం భద్రత మరియు గోల్స్ ను నిర్ధారించుకొని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చిత్తూరు జిల్లా డబ్ల్యు డి & సి డబ్ల్యు &, ఈవో శ్రీమతి వెంకటేశ్వరి గారు తెలిపారు.గ్రామంలో పదవ తరగతిలో అధిక మార్కులు సాధించిన ఎం. హరిప్రియ ఇంటర్ లో అధిక మార్పులు సాధించిన ఎం. జె. స్టెల్లా,భవిత ను సన్మానించడం అయినది. జిల్లాలో ఇప్పటివరకు బాలికల పైన జరిగిన అఘాయిత్యాలు, ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నారు పీడీ గారు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి నెల చైల్డ్ మ్యారేజ్ ప్రొవిషన్ మానిటరింగ్ కమిటీ ఈ గ్రామంలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూడాలని, డ్రాపౌట్స్ కి మోటివేషన్ చేసి వారిని స్కీం లైన్లోకి పంపాలని చెప్పడం జరిగింది. అన్ని రకాల ప్రికాషన్లు తీసుకొని కూడా అవగాహన కల్పించి కూడా అయినప్పటికీ చైల్డ్ మ్యారేజ్ జరిగినాప్పటికీ పక్షంలో ఆ వ్యక్తి పై ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేయాలని తెలియజేశారు .ఈ కార్యక్రమానికి డి.సి.పి.ఓ సుబ్రహ్మణ్యం . ఐరాల ప్రాజెక్టు ఆఫీసర్ జి నిర్మల ,బండపల్లి సర్పంచ్ పద్మావతి ,సూపర్వైజర్ ఐ. భారతి, సెక్రటరీ, ఏ.ఎన్.ఎం. సంఘo లీడర్లు, స్కూల్ హెచ్.ఎం, ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు మరియు ప్రజా ప్రతినిధులు హాజరైనారు.