ముండ్లమూరు: బాల్య వివాహాన్ని నిలిపివేసిన ఐసిడిఎస్ సిబ్బంది
ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామం లో శనివారం జరుగుతున్న బాల్య వివాహాన్ని అడ్డుకున్నట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ కమల కుమారి తెలిపారు. గ్రామంలో ఓ మహిళా స్థానిక కేజీబీవిలో 9వ తరగతి చదువుతున్న తన కుమార్తెకు వివాహం చేసేందుకు సిద్ధం అవ్వగా సమాచారం అందుకున్న ఐసిడిఎస్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి బాలికను అదే పాఠశాలలో చేర్చినట్లు సూపర్వైజర్ తెలిపారు.
