ముండ్లమూరు : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమం

ముండ్లమూరు మండలంలోని చిలకలేరు వాగు వద్ద కట్టెల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ఓవర్టేక్ చేయబోయే ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ముండ్లమూరు : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పరిస్థితి విషమం