అంబెడ్కర్ విగ్రహం పగులగొట్టిన దుండగులు

అంబెడ్కర్ విగ్రహం పగులగొట్టిన దుండగులు
UGC

BSR న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం స్కూల్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

సమీపంలోని చెరువులో దానిని విసిరేసినట్టు పోలీసులు గుర్తించారు. ఏడాది క్రితం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అంబేడ్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట దుండగులు తొలగించిన తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

దళిత సంఘాలు కూడా తమ నిరసనను తెలియజేశాయి.

పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. అంబేడ్కర్ విగ్రహ తలను తొలగించిన తీరుపై దర్యాప్తు చేస్తున్నట్టు తణుకు పోలీసులు బీబీసీకి తెలిపారు. దుండగులను పట్టుకుంటామని, పోలీసులు బృందాలు రంగంలో దిగాయని వెల్లడించారు.