అరుదైన వ్యాధి సార్ ఆదుకోండి సార్ అభాగ్యులకు అండగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

తాళ్లూరు మండలం, మాధవరం గ్రామానికి చెందిన ఆదిత్య కుమార్, రవి ప్రకాష్ నిరుపేదలైన ఇద్దరు అన్న తమ్ములు వెన్నుముక కణాల క్షీణత అనే వ్యాధితో బాధపడుతున్నారు అని శనివారం మార్కాపురం పర్యటనలో మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆ పేద రోగులు గురించి సీఎం గారికి వివరించడం జరిగింది. దాదాపు కోట్లల్లో ఖర్చు అవుతుందని ఈ అరుదైన వ్యాధికి నివారణ కూడా అంతంత మాత్రమేనని ప్రత్యామ్నాయాలు కూడా చూస్తున్నామని వందలో ఒకరు ఇద్దరు మాత్రమే ఇలాంటి వ్యాధి వస్తుందని దీనిపై ప్రభుత్వపరంగా వారికి అందాల్సిన సహాయాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ఆ అభాగ్యులకు హామీ ఇచ్చారు. ఆ పేద రోగులకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి హామీపై డాక్టర్ లక్ష్మీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఇద్దరు బాలురకు ప్రభుత్వపరంగా ఒక డాక్టర్ గా తాను అండగా ఉంటానని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు.