మన నారీ లోకం శక్తి మహోన్నతమైనది డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

ముందస్తుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని ఇంకా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు మాలాంటి మహిళా డాక్టర్లు సమాజంలో గౌరవప్రదంగా ఉన్నారన్నారు ఈరోజు మనం డాక్టర్లను చూస్తే మహిళలే ఎక్కువమంది వైద్య వృత్తి వైపు పయనిస్తున్నారన్నారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఇతర సాంకేతిక రంగాలలో మహిళలు పురుషులతో పోటీపడి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు క్రీడలలో పీవీ సింధు వంటి అనేకమంది ప్రపంచంలో గుర్తింపు పొందారన్నారు. మన కూటమి ప్రభుత్వం కూడా మహిళల ఆర్థిక అభివృద్ధికి వారి నైపుణ్యతకు ఎంతో సహకరిస్తుంది అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని ఆర్థిక శక్తిగా ఎదిగి విధంగా కుటుంబంలో మహిళల గౌరవాన్ని పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు గుమ్మడి సంధ్యారాణి గారి కృషితో మహిళల అభివృద్ధికి అనేక పథకాలను ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం వారు పారిశ్రామికవేత్తగలగా ఎదిగేందుకు ప్రభుత్వపరంగా అండదండగా ఉంటున్నాం ఇలా మన కూటమి ప్రభుత్వం మహిళల భద్రత రక్షణ తోపాటు ఆర్థిక అభివృద్ధికి నైపుణ్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వివరించారు...