పోరాడే అభ్యర్ధులను గెలిపించండి

పోరాడే అభ్యర్థులను గెలిపించండి... విశ్రాంత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ టి.గోపాల్ రెడ్డి.. .
విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి పేరయ్య... విశ్రాంత జిల్లా పరిషత్తు పిఇఓ సిహెచ్ జయప్రకాష్.... జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ జయప్రకాష్........
దర్శి.........ప్రజల కోసం కార్మికుల కోసం నిరుద్యోగుల కోసం రైతుల కోసం ఉపాధ్యాయుల కోసం మధ్యతరగతి ఉద్యోగుల కోసం పోరాడే పిడిఎఫ్ మరియు ప్రజా సంఘాలు బలపరిచిన ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డిని ఉపాధ్యాయ అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిని గెలిపించాలని దర్శిలో విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆఫీసులో అధ్యక్షతన రెద్ద్యం వెంకటరెడ్డి జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన విశ్రాంత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ టి గోపాల్ రెడ్డి మరియు విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి పేరయ్య మరియు విశ్రాంత జిల్లా పరిషత్తు పి జి శేషయ్య. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ జయప్రకాష్ లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలలో మాట్లాడే వ్యక్తులని మేధావులని ఎన్నుకోవాలని మేధావుల సభలకు మేధావులనే పంపించాలని రాష్ట్రంలో ఏ సమస్య ఉన్న ముందుకు వచ్చి పోరాడే పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ కార్యాలయాలని ప్రవేట్ పరం చేస్తూ నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే పిడిఎఫ్ అభ్యర్థులని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు రెడ్డెం వెంకటరెడ్డి. విశ్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు సంధి రెడ్డి వెంకటరెడ్డి. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య. జెవివి నాయకులు ఉప్పుటూరి నాగరాజు. ఎల్ఐసి యూనియన్ నాయకులు రాగిపిండి రామకోటిరెడ్డి. సిఐటియు మండల అధ్యక్షులు షేక్ కాలేభాష. డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎస్ కోటిరెడ్డి. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ధనీ రెడ్డి వెంకటరెడ్డి. యుటిఎఫ్ జిల్లా నాయకులు మారం రెడ్డి ఎలమందరెడ్డి. ఈటీఎఫ్ మండల కార్యదర్శి మీనిగా శ్రీను తదితరులు పాల్గొన్నారు