పోతవరం లో న్యాయం కోసం దళితుల ధర్నా

పోతవరం సచివాలయం ముందు దళితుల ధర్నా ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి మండలం, పోతవరం గ్రామ సచివాలయం ముందు రాష్ట్ర దళిత సేన, మాదిగ మహానాడు దర్శి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆ గ్రామ దళిత విద్యార్థులకు రెండో విడత అమ్మబడి పథకం కింద మంజూరైన వారి తల్లి అకౌంట్లో జమ చేయాలని కోరుతూ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాన్ని ఇప్పుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ నిర్లక్ష్యానికి దళిత విద్యార్థి అయిన కోట. గౌతమ్, కోట.నాగచైతన్యలకు అమ్మ ఒడి డబ్బులు మంజూరైన వారి తల్లి అకౌంట్లో జమ కాకపోవటం వల్ల వారి కుటుంబం ఆర్థికంగా స్థితికి పోతుందని ఆయన ఆవేద వ్యక్తం చేశారు, ఎక్కడో ఉన్న కర్నూలు జిల్లాలోAC 32825241759నెంబర్ కు 281311988562 ఆధార్ కు జనవరి 12న.ఉదయం10:21 గంటలకు సంబంధంలేని అకౌంట్ కు జమ చేయటం జరిగింది. దీనివల్ల అర్హులైన దళిత విద్యార్థులకు ఆర్థిక నష్టపోయారని దీనికి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ బాధ్యతరహితంగా నిర్లక్ష్యానికి ఆర్థికంగా చితికి నష్టపోయిన దళితవిద్యార్థులకు తక్షణమే జమ అమ్మఒడి డబ్బులను తిరిగి వారి తల్లి అకౌంట్లో జమ చేయాలని ఈ ఘటనపై దర్శి ఎంపీడీవో, ఎంఈఓ, క్షుణ్ణంగా విచారణ జరిపించి న్యాయం చేయని పక్షంలో దళిత విద్యార్థులు అండగా కలిసి వచ్చే విద్యార్థి సంఘాలతో ఆందోళన చేస్తామని ఆయన తెలియజేశారు ఈ ఆందోళనకు ఏ టి యు సి దర్శి ఏరియా నాయకులు జూపల్లి కోటేశ్వరరావు సంపూర్ణ మత తెలియజేశారు దర్శి ఎంపీడీవో శ్రీమతి కుసుమకుమారి ఫోన్లో మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారులకు దృష్టికి తీసుకుపోయి నష్టపోయిన దళిత విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో , ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో మాదిగ మహానాడు దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ గట్టుపల్లి.ప్రసాదు, తల్లిదండ్రులు కోట నాగేంద్రం, ఆదాo, కోట.నాగరాజు,కోట లాజరు, కోట.బాలయేసు, కోట రామయ్య, కోట వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు

పోతవరం లో న్యాయం కోసం దళితుల ధర్నా