ప్రజా భాగస్వామ్యం ద్వారానే పరిసరాల పరిశుభ్రత సాధ్యం,స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా ట్రాక్టర్లను పంపిణీ చేసిన Dr. గొట్టిపాటి లక్ష్మీ
ఈరోజు దర్శి నియోజకవర్గం, తాళ్లూరు మండల కేంద్రం, తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయం నందు స్వచ్ఛ కార్పొరేషన్ ద్వారా మంజూరైన నాలుగు గ్రామ పంచాయతీ లకు చెత్త తరలింపు ట్రాక్టర్లను మంగళవారం దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా శివరాంపురం, నాగమ్మట్లపాలెం, బుద్ధికోరుపాడు, లక్కవరం గ్రామ పంచాయతీ లకు అందజేశారు. Dr. లక్ష్మీ తో పాటు టిడిపి యువ నాయకులు Dr. కడియాల లలిత్ సాగర్ , మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు , మండల టిడిపి అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి , మండల ఇంచార్జ్ ఎంపీడీవో హనుమంత రావు , MRO ఇమ్మనీయులు, ఆయా పంచాయతీల సెక్రటరీలు తదితర అధికారులు, నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా Dr. గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ...
మన ఊరు మనం బాగు చేసుకుందాం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రేకెత్తించే కార్యక్రమంలో భాగంగా మన కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్ అనే ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆలోచనల లో భాగంగా మన మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ నిర్వహణలో చేయి చేయి కలుపుదాం మన ఊరు మనం శుభ్రం చేసుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతినెల మూడవ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అంతేకాక మండల కేంద్రాలు పెద్ద పెద్ద గ్రామాలలో కూడా చెత్తను పేరుకుపోనికుండా చెత్త తరలింపు ట్రాక్టర్లను స్వచ్ఛ కార్పోరేషన్ మిషన్ ద్వారా ఉచితంగా అందజేస్తున్నాం. ప్రతి గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని మన ఊరు మనం బాగు చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత వారంలో దర్శి పట్టణంలో ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టి పార్కు అభివృద్ధి చేసి చూపించాం. ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థలు ప్రజలు తరలివచ్చి పార్కు బాగు చేసుకునే కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములు ఇవ్వడం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. అదే స్ఫూర్తితో ప్రతి గ్రామంలో యువత మహిళలు స్వచ్ఛంద సంస్థలు మన ఊరు మన బాగు చేసుకుందాం అనే కార్యక్రమానికి ముందుకు రావాలని డాక్టర్ లక్ష్మీ పిలుపునిచ్చారు. మన కూటమి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు మనమందరం చేదోడువాదోడుగా నిలవాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే ఈ చెత్త తరలింపు ట్రాక్టర్లను సక్రమంగా సద్వినియోగం చేసుకొని ప్రతి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చుకోవాలని తద్వారా పరిసరాలు పరిశుభ్రమై ప్రజా ఆరోగ్యానికి దోహదపడుతుందని ఆమె కోరారు. ఒక డాక్టర్ గా పరిశుభ్రం ద్వారానే ఆరోగ్యం సాధ్యమవుతుందని నాకు తెలుసు అన్నారు. మన ప్రియతమ నాయకులు కూడా అదే స్తుతులు తీసుకొని ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛత కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపట్టడం శుభ పరిణామం అన్నారు. దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకునేందుకు ప్రజలందరూ భాగస్వామ్యం అవసరమని ఆమె కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఎనిమిది నెలల కాలంలో అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నిరుద్యోగ యువతకు ఊతమిస్తూ ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి బాటలు వేస్తున్నామని డాక్టర్ లక్ష్మీ వివరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు శాగం కొండారెడ్డి, మానం రమేష్ బాబు, మేడగం వెంకటేశ్వర రెడ్డి, పిన్నిక రమేష్ బాబు, ఇడమకంట శ్రీనివాస రెడ్డి, కైపు రామకోటిరెడ్డి, వల్లభనేని సుబ్బయ్య, రాచకొండ వెంకట్రావు, కైపు నాగార్జున రెడ్డి, గొల్లపూడి వేణుబాబు తురకపాలెం సర్పంచ్, కొర్రపాటివారిపాలెం సర్పంచ్ కొర్రపాటి శ్రీదేవి - రామయ్య, తదితర నాయకులు, మహిళలు, మరియు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.తదుపరి CPDO భారతి గారి అంగన్వాడీ టీచర్లు, డ్వాక్రా గ్రోప్ మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించటం జరిగినది.