వైఎస్ఆర్సిపి పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి గౌరవ డాక్టర్ సునీల్ కుమార్ గారు, చిత్తూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థి రెడ్డప్ప గారు,-BSR NEWS

వైఎస్ఆర్సిపి పూతలపట్టు నియోజకవర్గం  శాసనసభ అభ్యర్థి గౌరవ డాక్టర్ సునీల్ కుమార్ గారు, చిత్తూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థి రెడ్డప్ప గారు,-BSR NEWS

ఈ రోజు ఐరాల మండలంలోని కురపల్లి వడ్రంపల్లి చిన్నకంపల్లి తదితర గ్రామాలలో వైఎస్ఆర్సిపి పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి గౌరవ డాక్టర్ సునీల్ కుమార్ గారు, చిత్తూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థి రెడ్డప్ప గారు, మండల కన్వీనర్ బుజ్జి రెడ్డి గారు, మండలం ఎంపీపీ ,వైస్ ఎంపీపీ లు ,మండల పార్టీ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు అనుబంధ విభాగాల అధ్యక్షులు రాష్ట్ర జిల్లా మండల స్థాయి పార్టీ నాయకులు పాల్గొని ప్రతి గడపకు వెళ్లి జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని మరొక్కసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మన ఎమ్మెల్యే అభ్యర్థి గారిని అలాగే ఎంపీ గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని కరపత్రాలు పంచుతూ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాన్ని ముందుకు నడిపించారు. ప్రచార పర్వంలో అవ్వ తాతలు గత ఐదు సంవత్సరాల ముందు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ గారిని గుర్తుపెట్టుకుని ఎంతో అభిమానంతో పలకరిస్తూ వారి యొక్క దీవెనలు అందిస్తూ తప్పకుండా గెలిపిస్తామని చెప్పడం జరిగింది.