Vyooham: రాంగోపాల్ వర్మ ‘23’ ‘వ్యూహం’

Vyooham: రాంగోపాల్ వర్మ ‘23’ ‘వ్యూహం’

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను ఇతివృత్తంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను రూపొందించారు. విడుదలకు ముందే ఈ సినిమా వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

Vyooham: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీజింగ్ మామూలుగా ఉండదు. ఏదైనా విమర్శ చేయాలంటే ఆయన వెనుకడుగు వేయరు. ఎంతటి వారినైనా సునిశిత విమర్శలతో ఓ రేంజ్ లో ఆడుకోవడం ఆర్జీవికి అలవాటైన విద్య. ప్రస్తుతం ఆయన ఒక వైసీపీ నేతగా మారిపోయారు. రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ లను ఆర్జీవి టార్గెట్ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా కోర్టు వివాదాలను దాటుకొని రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 23న చిత్రాన్ని విడుదల చేసేందుకు యూనిట్ బృందం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్ వైరల్ గా మారుతోంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను ఇతివృత్తంగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను రూపొందించారు. విడుదలకు ముందే ఈ సినిమా వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్లతోనే ఈ చిత్రం దుమారాన్ని రేపింది. రెండు నెలల కిందట సెన్సార్ పూర్తయిన ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా ఆపాలని నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సెన్సార్ ను రద్దు చేసింది. ఈ తీర్పున సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ లో చిత్ర యూనిట్ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చిత్రాన్ని మరోసారి సమీక్షించాలని సెన్సార్ బోర్డు కు కోర్టు సూచించింది. సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో వ్యూహం సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అయ్యింది. దీంతో ఈ నెల 23న సినిమా రిలీజ్ కు యూనిట్ సిద్ధపడుతోంది.

ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు. ఈ సినిమా విడుదలతో చంద్రబాబుకు సంబంధం ఇది అంటూ లక్కీ నెంబర్ 23 అని రాసుకొచ్చారు. వైసీపీ నుంచి చంద్రబాబు లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23 మంది. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది 23వ తేదీనే. టిడిపి గెలుచుకున్న స్థానాలు 23. అక్రమ కేసుల్లో అరెస్ట్ అయినది 23 తేదీనే. చంద్రబాబు జైలు గది సైతం 7961 కలిపితే 23. లోకేష్ పుట్టినరోజు తేదీ 23. వ్యూహం సినిమా గర్జన ఈవెంట్ 23 తేదీన, ఇప్పుడు రిలీజ్ 23వ తేదీన నిర్వహిస్తున్నామని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేటిజెన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.