తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజానగరం గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన ప్రకాశం పోలీసులు
తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజానగరం గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన ప్రకాశం పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మల్లికాగర్గ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తాళ్లూరు పరిధిలోని రాజానగరం గ్రామ సచివాలయాన్ని ఎస్సై ప్రేమ్కుమార్ గారు సందర్శించారు.సచివాలయం పోలీసులు నిర్వహించాల్సిన విధులు,రికార్డ్స్ పరిశీలించారు. గ్రామంలో శాంతిభద్రతలపై సచివాలయం పోలీసులు రూపొందించిన రికార్డ్స్ అందులోని నివేదికలు చూశారు. గ్రామస్తులను మరియు సచివాలయం కి వచ్చే ప్రజలకు సిబ్బంది సహాయక సహకారాలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పోలీస్ వారు సచివాలయం పోలీసులకు పలు సూచనలను సలహాలు ఇచ్చారు.