తాళ్లూరు మండల ఎస్సైగా సుదర్శన్ నియామకం
మండలంలో నూతన ఎస్సైగా బి సుదర్శన్ యాదవును నియమిస్తూ ఎస్పీ మల్లికాగర్గ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహించిన ప్రేమ్ కుమార్ పలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఒంగోలు వి ఆర్ కు బదిలీపై వెళ్లారు. ఒంగోలులో పనిచేస్తున్న సుదర్శన్ ను తాళ్లూరు ఎస్సైగా నియమించారు. కాగా త్వరలోనే వీరు తాళ్లూరు మండల ఎస్సైగా బాధ్యతలు తీసుకోనున్నారు.
