అమెజాన్ ఉద్యోగుల జీతాల్లో సగం కోత!
గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (AMAZON)లో పనిచేస్తున్న ఉద్యోగులు భారీ జీతాల కోతనే ఎదుర్కొనబోతున్నారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, అంతర్జాతీయ మార్కెట్‌లో వ్యాపార మందగమనం, పడిపోతున్న ఆదాయం-లాభాలు, పెరుగుతున్న వ్యయం కారణాలతో 18వేల మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేస్తున్నట్టు (LAYOFFS) సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మిగిలిన ఉద్యోగుల వేతనాలనూ తగ్గించే దిశగా అమెజాన్ అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ఈ ఏడాది 50 శాతం వరకు జీతాల (SALARY)ను కట్ చేయబోతున్నట్టు అక్కడి కార్పొరేట్ సిబ్బంది చెప్తున్నారు. హోదా, తీసుకునే వేతనం ఆధారంగా ఈ కత్తిరింపులుంటాయని అంటున్నారు. కాగా, గత ఏడాది అమెజాన్ షేర్ల విలువ 35 శాతం పడిపోయింది.

అమెజాన్ ఉద్యోగుల జీతాల్లో సగం కోత!