TDP అధిష్టానం దర్శి టికెట్ బాదం మాధవరెడ్డి కి ఖరారు చేయనుందా..??

Rrదర్శి అసెంబ్లీకి వచ్చే ఏడాది అనగా 2024 లో జరిగే సాధారణ ఎన్నికల్లో.. మౌమిత ఫౌండేషన్ అధినేత బాదం మాధవరెడ్డి బరిలోకి దిగబోతున్నారా..?

తెలుగు దేశం పార్టీ టికెట్ ఆయన ఆశిస్తున్నారా..?

టిడిపి అధిష్టానం మాధవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే యోచనలో ఉందా..?

దర్శిలో రీఎంట్రీ ఇవ్వడానికి బాదం రడీ అయ్యారా..?

ఇలాంటి ప్రశ్నలకు రాజకీయవర్గాల్లో అవుననే సమాదానం వినిపిస్తోంది.

ఇటివల చోటు చేసుకున్న పరిణామాలు కూడా అందుకు ఊతమిస్తున్నాయి.

దొనకొండ మండలం పోలేపల్లి పంచాయతీ కంభంవారిపల్లెలో జరుగిన వివాహ కార్యక్రమంలో తన అనుచరులతో కలిసి పాల్గొన్న మాధవరెడ్డి అనంతరం దర్శిలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. అభిమానులతో కొంత సేపు ముచ్చటించిన ఆయన ఇంటికి సంబంధించి.. రీమోడలింగ్, పెయిటింగ్ తదితర పనులు చేయించాలని ఆదేశించడం.. క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఖాయమేనన్న వాధనలకు బలం చేకూరీనట్లైంది.

ఏదిఏమైనా  దర్శిలో బాదం గ్రాండ్ రీ ఎంట్రీ ఎప్పుడు అన్న దానిపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందేనని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.